ఎమ్మెల్సీ ఎన్నికల్లో పై 'చేయి'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలపై కాంగ్రెసు పైచేయి సాధించింది. ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెసు గెలుచుకుంది. విశాఖ జిల్లాలోని స్థానికసంస్థల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డివీ సూర్యనారాయణ రాజు విజయం సాధించారు. మొత్తం 819మంది ఓటింగ్‌లో పాల్గొనగా 432 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి, 357 ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి వచ్చాయి. 30 ఓట్లు చెల్లలేదు. ఈ రెండుపార్టీల మధ్యే పోటీ నడిచింది.
ఖమ్మం స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోట్ల నాగేశ్వరరావు విజయం సాధించారు. మూడురోజుల క్రితం జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను గురువారం ప్రకటించారు. మహాకూటమి తరపున పోటీచేసిన పొట్ల నాగేశ్వరరావు 119 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నల్గొండలో స్థానికసంస్థల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన డీసీసీ అధ్యక్షుడు నేతి విద్యాసాగర్ గెలుపొందారు. సమీప ప్రత్యర్థి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌పై ఆయన 83 ఓట్ల తేడాతో విజయం సాధించారు.












Click it and Unblock the Notifications