జూ.ఆర్టిస్ట్ ప్రణతి ఆత్మహత్యా యత్నం
హైదరాబాదు: పంజాగుట్టలో అపార్టుమెంటు పైనుంచి దూకి ప్రణతి అనే జూనియర్ ఆర్టిస్టు ఆత్మాహత్యకు ప్రయత్నించింది. అపార్టుమెంటు రెండో అంతస్తుపై నుంచి దూకి తీవ్రంగా గాయపడిన ప్రణతి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తీవ్రంగా గాయపడిన ప్రణతిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రణతి ఆత్మహత్యకు ప్రయత్నించడానికి సరైన కారణాలు ఇంకా తెలయటం లేదు. ఆమె ఉంటున్న ఫ్లాట్ లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులు దాడి చేయబోతున్నారన్న సమాచారం తెలుసుకున్న ప్రణతి రెండో అంతస్తునుంచి దూకిందని స్థానికులు అంటున్నారు.
పంజాగుట్టలోని మహమూద్ అపార్ట్ మెంటులో ప్రణతితో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉంటున్నట్లు తెలిసింది. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications