చిరు క్షమాపణ అక్కర్లేదు: ఆంజనేయరెడ్డి
హైదరాబాద్: పార్టీలో పరిణామాలు తనకు మనస్తాపం కలిగించినందుననే తాను ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేశానని ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆంజనేయ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పరిణామాలకు అనేకమంది కారణమని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆదివాంనాడు అన్నారు. చిరంజీవి తనకు క్షమాపణ చెప్పాల్పిన పనిలేదని ఆయన అన్నారు. పార్టీలో ఇమడలేని వారు, పరిస్థితులు నచ్చనివారు బయటకు వస్తున్నారని ఆయన అన్నారు.
ఆంజనేయరెడ్డి రాజీనామా దురదృష్టకరమని, జరిగినదానికి తాను ఆయనకు క్షమాపణ చెప్పి తిరిగి రమ్మంటానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్నారు. ఇందుకు స్పందించిన ఆంజనేయరెడ్డి చిరంజీవి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తానే ఆయనతో మాట్లాడతానని అన్నారు.












Click it and Unblock the Notifications