భయపడి చిరు పారిపోయాడు: రోజా
చిత్తూరు: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి భయపడ్డారని, అందుకే చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటనకు రాలేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు, చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోజా వ్యాఖ్యానించారు. తిరుపతిలో నామినేషన్ వేసిన అనంతరం చంద్రగిరి పర్యటనకు వస్తానని చిరంజీవి చెప్పారని, అయితే రాలేదని, భయపడ్డారు కాబట్టే రాలేదని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం చిరంజీవికి లేదని ఆమె అన్నారు. చిరంజీవి పారిపోయారని ఆమె అన్నారు.
ఆంజనేయరెడ్డి వంటి నాయకులను మోసం చేసిన చిరంజీవి ఇక సామాజిక న్యాయం ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు. దళిత మహిళ అయిన శోభారాణికి చిరంజీవి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదని ఆమె అన్నారు. సమరం, మిత్రా వంటి మంచి వ్యక్తులకు కూడా చిరంజీవి టిక్కెట్లు ఇవ్వలేదని ఆమె అన్నారు. టిక్కెట్లను చిరంజీవి అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications