9న విజయనగరం జిల్లాకు బాలయ్య

Balakrishna
విజయనగరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ నెల 9న జిల్లాలో పర్యటించనున్నారు.ఈ మేరకు టిడిపి అధిష్ఠానం నుంచి జిల్లా నేతలకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్‌ ప్రకారం 8వ తేదీ రాత్రి బొబ్బిలిలో బస చేస్తారు. 9వ తేదీ ఉదయం పది గంటలకు బొబ్బిలిలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం పదకొండున్నర గంటలకు సాలూరులో రోడ్‌ షో నిర్వహిస్తారు.

బాలకృష్ణ చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించి ఇటీవలే హైదరాబాదు చేరుకున్నారు. అంతకు ముందు ఆయన దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెసు అవినీతి పాలనపై ఆయన తన పర్యటనల్లో దుమ్మెత్తి పోస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+