వరుణ్ పై వ్యాఖ్యలతో చిక్కుల్లో లాలూ

తాను హోంమంత్రిని అయి ఉంటే వరుణ్ గాంధీని రోలర్ తో నలిపేసి ఉండేవాడినని లాలూ ప్రసాద్ సోమవారం కిషన్ గంజ్ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా వరుణ్ ఛాతీ మీది నుంచి రోలర్ నడిపించి ఉండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. తాను వరుణ్ గాంధీని మతతత్వ శక్తులకు ప్రతీకగా మాత్రమే తీసుకున్నానని, తాను మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మాత్రమే వ్యాఖ్యలు చేశాను తప్ప వరుణ్ కు వ్యతిరేకంగా కాదని లాలూ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications