హైదరాబాద్: వైఎస్ ను తాను ఎందుకు అసహ్యించుకుంటానో కొన్ని కారణాలు చెప్పాడు పవన్ కల్యాణ్. ఒక ఐపిఎస్ అధికారి హత్య కేసులో నిందితుడిని వైఎస్ ప్రభుత్వం విడుదల చేసిందని, అటువంటి వాటిని తాను వ్యతిరేకిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన వివిధ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ఆయన ప్రధానంగా శాంతి భద్రతల సమస్యను ప్రస్తావించారు. వైఎస్ హయాంలో గూండాలు, ఫ్యాక్షనిస్టులు స్వేచ్చగా తిరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి అక్రమాలను, భూ కబ్జాలను, సెజ్ ల పేరిట రైతుల భూములను కాజేయడాన్ని ప్రస్తావించారు. పవన్ సభలకు మంచి స్పందన లభించింది. నగరంలోని పిఆర్పీ శ్రేణుల్లో ఆయన నూతనేత్తేజాన్ని నింపారు.