చిరు పార్టీకి బొప్పన రాజీనామా
విజయవాడ: విజయవాడ అర్బన్ కన్వీనర్ బొప్పన భవకుమార్ ప్రజారాజ్యం పార్టీకి గురువారం రాజీనామా చేశారు. తనకు టిక్కెట్ రానందుకు నిరసనగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో గుర్తింపు లేకపోవడం వల్లనే తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తాను ఏ పార్టీలో చేరేది రెండు రోజుల్లో చెప్తానని ఆయన అన్నారు.
పార్టీ టిక్కెట్ రాకపోవడం అంత ముఖ్యం కాదని, పార్టీ టిక్కెట్ల పంపకం సందర్భంగా తమను సంప్రదించకపోవడం మనస్తాపానికి గురి చేసిందని ఆయన అన్నారు. చిరంజీవి ప్రకటనలు నచ్చి అప్పట్లో తాను పార్టీలో చేరానని ఆయన చెప్పారు. చిరంజీవి అభిమానులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. పార్టీలో సమన్వయం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications