పరకాల వెన్నుపోటు: శోభారాణి
హైదరాబాద్: పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీని వెన్నుపోటు పొడిచారని మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి విమర్శించారు. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చే విధంగా పార్టీపై సాగదీస్తూ విమర్శలు చేయడం పరకాల ప్రభాకర్ చేయాల్సిన పని కాదని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇష్టం లేకపోతే హుందాగా ఏమీ మాట్లాడకుండా రాజీనామా చేసి పరకాల వెళ్లిపోయి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. తనపై జరుగుతున్న విషప్రచారానికి పరకాల వ్యాఖ్యలు ప్రోద్బలం కల్పిస్తాయని ఆయన అన్నారు. అన్య మనస్కంగా పార్టీలో ఉండడం కన్నా హుందాగా పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదని ఆయన అన్నారు.
తాను పార్టీ వైఖరికి బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, అందులో నిజం లేదని ఆమె అన్నారు. పరకాల ప్రభాకర్ పార్టీ కార్యాలయ వేదిక మీంచే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చే విధంగా మాట్లాడడం బాధాకరంగా ఉందని ఆమె అన్నారు. పరకాల ప్రభాకర్ తో మాట్లాడేందుకు తమ పార్టీ నేత చిరంజీవి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోందని, అలా కాకుంటే ఇప్పటికే పరకాల ప్రభాకర్ రాజీనామాపై ప్రకటన చేసి ఉండేవారని ఆమె అన్నారు. పరకాల ప్రభాకర్ పద్ధతి అహంకారపూరితంగా ఉందని ఆమె అన్నారు. ప్రజారాజ్యం పార్టీని దెబ్బ తీయడానికి అన్ని రాజకీయ శక్తులు ఏకమైన తరుణంలో పరకాల ప్రభాకర్ వంటి వారు ఒక అసెంబ్లీ స్థానానికి పరిమితం కావడం మంచిది కాదని, ఈ విషయాన్ని పరకాల ప్రభాకర్ ఆలోచించాల్సి ఉండిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications