హంగ్ అసెంబ్లీ ఖాయం: వెంకయ్య

Venkaiah Naidu
వరంగల్: రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా చతుర్ముఖ పోటీ ఉందని, దాని వల్ల ఏ పార్టీకి కూడా మెజారిటీ లభించే అవకాశాలు లేవని ఆయన గురువారం ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఒక మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. వరుణ్ గాంధీపై నాసా ప్రయోగించివారు డిఎస్ ను ఎందుకు వదిలేస్తున్నారని ఆయన అడిగారు.

జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ కు మనుగడ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది వరకు మూడు సార్లు ప్రయోగాలు జరిగి విఫలమయ్యాయని ఆయన అన్నారు. మూడో ఫ్రంట్ అంటున్న పార్టీలకు సిద్ధాంతాలు లేవని, ఉమ్మడి ప్రణాళిక లేదని, నేత లేరని ఆయన అన్నారు. మూడో ఫ్రంట్ అంటున్న రాజకీయ పార్టీల నాయకులు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత వారి వారి సిద్ధాంతాలను బట్టి ఇటు బిజెపితోనో, అటు కాంగ్రెసుతోనో మూడు ఫ్రంట్ అంటున్న నాయకులు చేరిపోతారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని, దీన్ని ప్రజలు నమ్ముతున్నారని, అందువల్ల తమను ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+