ఎన్టీఆర్ కు 4 వారాల విశ్రాంతి

డాక్టర్ల సూచనలతో జూనియర్ ఎన్టీఆర్ ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. అయితే ప్రచారానికి వెళ్తారా అని అడిగితే అది జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత విషయమని, తాము ఈ విషయంలో ఏమీ చెప్పలేమని వారు జవాబిచ్చారు. రెండో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే అది సాధ్యమయ్యే అవకాశాలు లేవని తేలిపోయింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వీడియోలు రూపొందించి ప్రచారానికి వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications