శక్తి సామంత కన్నుమూత

Shakti Samanta
ముంబయి: ప్రముఖ దర్శక నిర్మాత శక్తి సామంతా గురువారం సాయంత్రం తన స్వగృహంలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతతో బాధ పడుతున్నారు. ఆయన కటి పతంగ్, అమర్ ప్రేమ్, ఆరాధన వంటి హిట్ చిత్రాలు తీశారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు మనువలు ఉన్నారు.

గుండెపోటు నుంచి కోలుకుంటున్న ఆయన గురువారం సాయంత్రం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల పాటు గుండె నొప్పికి చికిత్స పొందిన అనంతరం రెండు వారాల క్రితం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారని సామంతా కుమారుడు ఆసిం సామంతా చెప్పారు. సామంతా 43 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో 37 హిందీ సినిమాలు, 6 బెంగాలీ సినిమాలు ఉన్నాయి. 1954లో బహు సినిమాకు దర్శకత్వం వహించడం ద్వారా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు.షర్మిలా ఠాగూర్ ను సినిమాలకు పరిచయం చేసింది ఆయనే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+