రషీద్ మాలబారీ లాయర్ కాల్చివేత
మంగళూర్: అండర్ వరల్డ్ గన్ మాన్ రషీద్ మాలబారీ న్యాయవాది హత్యకు గురయ్యాడు. నౌషాద్ కాసింను గురువారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో మంగుళూర్ లో కాల్సి చంపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను రాత్రి మంగళూర్ లోని ఫాల్నీర్ ప్రాంతంలో హత్య చేశారు. హంతకుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.
ఇదిలా వుంటే,ఈ హత్య తానే చేశానని అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి అంటున్నాడు. బెంగుళూర్ లోని ఒక స్థానిక టెలివిజన్ ఛానెల్ ప్రతినిధితో ఫోనులో మాట్లాడుతూ హత్య తానే చేసినట్లు చెప్పాడు. హత్యకు అతను మతం రంగు పులిమే ప్రయత్నం చేశాడు. నడిచి వెళ్తుండగా నౌషాద్ ను హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ సమయంలో అతను 200 మీటర్ల మేర పరిగెత్తి ఒక అపార్ట్ మెంటు ఆవరణలో కుప్పకూలిపోయాడు.












Click it and Unblock the Notifications