'ఎన్టీఆర్ పిల్లాడు,బాబును శపించేవాళ్లం'

జూనియర్ ఎన్టీఆర్ చిన్న పిల్లవాడు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు, తాము జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు శపిస్తామని ఆయన ప్రశ్నించారు. తమ శాపానికి బలమే ఉంటే తమ ప్రత్యర్థి అయిన చంద్రబాబునే శపించి ఉండేవాళ్లమని ఆయన అన్నారు. చంద్రబాబు అందగాడు, ప్రపంచ స్థాయి నాయకుడు, అంతర్జాతీయ స్థాయి గడ్డం ఉన్నవాడు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగదు బదిలీ పథకాన్ని అమలుచేసేందుకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసుకోవటం కూడా చంద్రబాబుకు తెలియదని అన్నారు. స్విస్ బ్యాంకుల్లో దాచిన డబ్బు తెచ్చి ఈ పథకం అమలుచేస్తామనటం హాస్యాస్పదమని అన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తే దానికి 5 రూపాయల 25 పైసలు వసూలు చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.












Click it and Unblock the Notifications