నేను ముసలిదాన్నా?: ప్రియాంక
అమేథీ: కాంగ్రెసును వృద్ధ వనితగా అభివర్ణించడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంకా వాద్రా బిజెపి నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. తాను వృద్ధురాలిగా కనిపిస్తున్నానా అని ఆమె ప్రజలను అడిగారు. సోదరుడు రాహుల్ గాంధీ విజయం కోసం ఆమె శనివారం అమేధీ లోకసభ నియోజక వర్గంలో ప్రచారం సాగించారు.
కాంగ్రెస్ వృద్ధ వనిత కాదని ఆమె చెప్పారు. తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ వృద్ధులుగా కనిపిస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం కాంగ్రెసును గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. మోడీ పదే పదే కాంగ్రెసు పార్టీని 125 ఏళ్ల వృద్ధురాలిగా తన ప్రసంగాల్లో అభివర్ణిస్తూ వచ్చారు. 30 ఏళ్ల యువ బిజెపిని గెలిపించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications