వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా అక్కను ఓడించండి: బాలయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
విశాఖపట్నం: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు విశాఖ పర్యటనలో సోదరి పురంధేశ్వరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఆదివారం విశాఖపట్నంలో పలు సభల్లో మాట్లాడారు. తనకు బంధుప్రీతి లేదని ఆయన స్పష్టం చేశారు. తన అక్క పురంధేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే ఆమెకు ఓటు వేయాలని అడిగేవాడినని, కానీ తమ తండ్రి ఎన్‌టీఆర్‌ ఆశయాలకు బద్ధ విరోధి అయిన కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆమె పోటీ చేయడం సిగ్గుచేటుగా అభివర్ణించారు.కాంగ్రెసు నుంచి పోటీ చేస్తున్నందున తన అక్కను ఓడించమని అడుగుతున్నట్లు ఆయన తెలిపారు.

'మా అక్కగారు పెద్దావిడ. ప్రతిభావంతురాలు. ఆమెపై నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఆమె కాంగ్రెస్‌ ను ఎంచుకోవడం దురదృష్టకరం. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిని ఎన్‌టీఆర్‌తో పోల్చడం సిగ్గుచేటు. వైఎస్‌లా మా నాన్న ఫ్యాక్షనిస్టూ కాదు. అవినీతిపరుడు అసలే కాదు' అని ఆయన అన్నారు. ఇందిర, రాజీవ్‌ హత్యలు జరిగినప్పుడు ఎలాంటి సంబంధం లేకపోయినా ఎన్‌టీఆర్‌ పైనా ఆయన ఆస్తుల పైనా కాంగ్రెస్‌ వాళ్లు దాడులు చేశారని, పురంధేశ్వరి ఇప్పుడు అలాంటి పార్టీలో చేరి ఆ నేతలను పొగడటం సరి కాదని బాలకృష్ణ అన్నారు.

'యుద్ధం మొదలైంది, జబ్జలు చరచండి. అవినీతిపరుల్ని కత్తులతో కాదు కంటిచూపుతో చంపేద్దాం. మీరు తెలుగుదేశానికి వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్‌ పార్టీ గుండెలపై సమ్మెట పోటు కావాలి' ానయ పిలుపునిచ్చారు.'కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. సామాజిక న్యాయం చేస్తామని, మార్పు తెస్తామని ఏదేదో చెబుతున్నాయి. ప్రజలు మార్పు కోరుతున్నారో లేదో గానీ ఆ పార్టీ నాయకులు మాత్రం మార్పు కోరుకుంటున్నారు. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ప్రజారాజ్యం అధినేత ప్రజలు కోరితే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు. అదే నిజమైతే ప్రజల నుంచినాయకుల్ని తయారు చేయాలే తప్ప, వలసల్ని ప్రోత్సహించకూడదు కదా.! ఆ పార్టీలో ప్రస్తుతం అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి' అని ఆయన ప్రజారాజ్యం పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం నేతలు అధికారంలోకి రాకముందే కోట్ల రూపాయలు సంపాదించేశారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X