వారి గుండెల్లో రైళ్లు: చిరంజీవి

ప్రభుత్వ పథకాల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు. ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టలేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, అయితే వాటిలో అవినీతి లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రజలను సవతి బిడ్డలుగా చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పాట్లు కాంగ్రెసు పార్టీకి పట్టడం లేదని ఆయన అన్నారు. తమ భవిష్యత్తుపై తప్పుడు అంచనాలు వేస్తున్నారని ఆయన అన్నారు. తమ సభలకు ప్రజలు ప్రభంజనంలా వస్తున్నారని, చిరంజీవికి అవకాశమిస్తామని ప్రజలు అంటున్నారని, తాము ఎదురులేని శక్తిగా ముందుకు వస్తామని, తాము అధికారం చేపడతామని ఆయన అన్నారు. ఇందిరమ్మ పథకంపై ఆయన విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications