చిరు పార్టీపై వారిద్దరి కుట్ర: దేవేందర్

రాష్ట్రాన్ని చంద్రబాబు, వైయస్ తమ జాగీర్ గా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బతికున్నంత వరకు తామిద్దరిలో ఎవరో ఒకరం మాత్రమే రాష్ట్రాన్ని పాలించాలనేది వారి ఉద్దేశమని ఆయన అన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలన సాగించారని, ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. వైయస్ ఐదేళ్లు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు.వైయస్ రాజశేఖర రెడ్డి దొరికింది దొరికినట్లు దోచుకు తిన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు వారి జాగీరదారీ మనస్తత్వాన్ని సహించబోరని ఆయన అన్నారు. వారిద్దరి పట్ల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications