తుపాకి పేలి హెడ్ కానిస్టేబుల్ మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తుపాకి పేలి ప్రసాద్ అనే హెడ్ కానిస్టేబుల్ సోమవారం ఉదయం మృతి చెందారు. ఆదివారం రాత్రి ఎలక్ట్రానిక్ పోలింగ్ యంత్రాల బందోబస్తులో ఆయన ఉన్నారు. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న తుపాకి ప్రమాదవశాత్తు పేలిందని, దాంతో గొంతులోకి బుల్లెట్ దూసుకుని వెళ్లటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారని చెబుతున్నారు.
అయితే ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారనే కథనం కూడా వినిపిస్తోంది. ప్రసాద్ ఆత్మహత్యను ప్రమాదవశాత్తు తుపాకి పేలి అతను చనిపోయాడని అధికారులు ప్రచారం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి తగిన కారణాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications