ఎన్టీఆర్ కు పోటీగా రాలేదు: రామ్ చరణ్

ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల గుర్తు రైలింజన్ ను ప్రజలకు పరిచయం చేయడానికి రైలు యాత్ర సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.తమ పార్టీకి రైలింజన్ మాత్రమే ఉందని, బోగీలు లేవని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. తమకు బోగీలు అవసరం లేదని, రాష్ట్రంలోని 7 కోట్ల ప్రజలే తమ రైలింజన్ బోగీలని ఆయన అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారంతా కలుపు మొక్కలేనని, అటువంటి వారు వెళ్లిపోవడమే మంచిదని ఆయన అన్నారు. పార్టీలో అటువంటి వారు ఉంటే దుష్ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. తమ యాత్రకు మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పుకున్నారు. ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచి తీరుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications