రాహుల్ ప్రధాని అవుతారు: ప్రియాంక

ఈసారి మాత్రం మన్మోహన్ సింగే ప్రధాని అవుతారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయాల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తారన్న ప్రశ్నకు- రాజకీయాల్లో ప్రవేశించడానికి తాను వ్యతిరేకం కాదని తెలిపారు. "ఎప్పటికీ చేరనని చెప్పను కాని..ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు" అని ఆమె జవాబిచ్చారు. ములాయం నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ తిరోగమన పార్టీ అని ఆమె దుయ్యబట్టారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ మరో ఐదేళ్ల పాటు ఎంపీగా ఉండాలని చెప్పారు. తన తల్లి కంటే సోదరుడు రాహుల్‌కు ఎక్కువ ఓట్లు రావాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications