వారంతా కలుపు మొక్కలు: రామ్ చరణ్

Ram Charan Teja
విజయవాడ: ప్రజారాజ్యం పార్టీని వీడిపోయే వారు కలుపు మొక్కలని సినీ నటుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజా అన్నారు. గుర్తుపై ప్రజలకు చైతన్యం కల్పించడానికే తాము ప్రజా రైలు యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజారాజ్యం తరపున తాము చేపట్టిన రైలు యాత్రకు జనం స్పందన అద్భుతంగా ఉందని ఆయన అన్నారు.

అన్ని స్టేషన్లలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. విశాఖనుంచి ప్రజారైలు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండున్నర గంటలకు విజయవాడ చేరింది. నగరంలోని ఓ హోటల్‌లో రామ్‌ చరణ్‌ బస చేశారు. ఉదయం తిరిగి ఆయన రైలు వద్దకు వెళ్లి అందరితో కలిసి తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ యాత్రకు వస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+