హైదరాబాద్: సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కంపెనీ బిడ్‌ను టెక్ మహేంద్ర కంపెనీ చేజిక్కించుకుంది. సోమవారం ఉదయం ముంబైలో జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో ఫైనాన్షియర్లు తమ బిడ్లను దాఖలు చేశారు. కాగ్నిజెంట్, విల్సన్ రాస్ కంపెనీలు తమ బిడ్లను దాఖలు చేశాయి. ఇందులో అత్యధికంగా కోట్‌చేసిన టెక్ మహేంద్ర కంపెనీ 1757 కోట్లతో 31 శాతం వాటాను దక్కించుకుంది. దీనితో సత్యం ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు మెగా కుంభకోణానికి పాల్పడినా నిపుణులైన సిబ్బంది, మంచి స్ధిరాస్తులు ఉన్న సత్యం కంపెనీని చేజిక్కించుకోడానికి అనేక సంస్ధలు ప్రయత్నించాయి.