రాజకీయాల్లో చేరను: కమల్ హాసన్

తాను ఓ స్క్రిప్టు రాస్తున్నానని, దాని పేరు ఖరారు కాగానే హిందీలోనూ తమిళంలోనూ నిర్మిస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎ వెడ్నస్డే సినిమాను తెలుగులో, తమిళంలో తీస్తున్నానని, తాను నషీరుద్దీన్ షా పోషించి ఆమ్ ఆద్మీ పాత్ర పోషిస్తున్నానని, మోహన్ లాల్ పోలీసు కమిషనరుగా నటిస్తున్నారని ఆయన చెప్పారు. మల్టీఫ్లెక్సులు కట్టే ఉద్దేశం లేదని, తాను సినిమా దర్శకుడిని, నటుడ్ని మాత్రమే గానీ వ్యాపారవేత్తను కానని ఆయన అన్నారు. కూతురు శృతిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. శ్రుతి చాలా సెన్సిబుల్ గర్ల్ అని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైనదని ఆయన అన్నారు.
తన సినిమాలతోనే తాను ఎక్కువ బిజీగా ఉంటానని, వేరే విషయాలు పట్టించుకునే తీరిక ఉండదని ఆయన అన్నారు. తీరికగా ఉన్నప్పుడు ఇంట్లో సినిమాలు చూస్తూ బిజీగా గడుపుతానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications