నాకు ప్రాణహాని: పరకాల

తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారనేది చెప్పలేనని, ల్యాండ్ లైన్ కు ఫోన్ కాల్స్ వస్తుండడంతో గుర్తించలేక పోతున్నానని ఆయన చెప్పారు. తాను ఇప్పటికే స్థానిక పోలీసు స్టేషనులో ఈ విషయం చెప్పానని, అయితే డిజిపిని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేస్తే మంచిదని మిత్రులు సలహా ఇచ్చారని, దాంతో డిజిపిని కలిశానని ఆయన చెప్పారు.
ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఆ పార్టీ వ్యవహారాలపై తీవ్రంగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీని ఆయన విషవృక్షంగా అభివర్ణించారు. ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయం పాటిస్తున్నట్లు చెబుకుంటున్న మాటల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications