చిరు పార్టీ అభ్యర్థి విజయేంద్ర అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ శాసనసభ సీటు అభ్యర్థి విజయేంద్ర ఓటర్లకు పంచేందుకు డబ్బు దాచినట్లు ఫిర్యాదులు రావటంతో పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆయన ఇంట్లో 2.45 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనను అరెస్టు చేశారు. అనంతరం బెయిలుపై విడుదల చేశారు.
పోలింగ్ కు ఒక రోజే గడువు ఉండడంతో రకరకాల పద్ధతుల్లో అభ్యర్థులు వోటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు హైదరాబాదులోని పలు చోట్ల దాడులు నిర్వహించారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పెద్ద యెత్తున మద్యం బాటిళ్లు, డబ్బు పోలీసుల చేతికి చిక్కాయి.












Click it and Unblock the Notifications