రెండు గంటల సినిమానా: చిరుకు వైయస్ ప్రశ్న

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అంటే తాము పండుగ అని నిరూపించి చూపామని ఆయన అన్నారు. మోసపూరిత చంద్రబాబును నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నాడనే పద్ధతిలో చంద్రబాబు వ్యవహారం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమను గద్దె దింపాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు మోసపూరిత, అసత్య వాగ్దానాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications