హైదరాబాద్: సినీ హీరో నితిన్ ఎన్నికల్లో తొలి సారి ఓటేశాడు. తాను సినిమా షూటింగును వాయిదా వేయించి ఓటు వేయడానికి వచ్చినట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అతను చెప్పాడు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు వేయడం ఎంతైనా అవసరమని అతను చెప్పాడు.
క్యూలో నిలబడి తాను ఓటు వేశానని అతను చెప్పుకున్నాడు. దాదాపు గంట సేపు తాను క్యూలో నిలబడ్డానని, ఓటు ప్రాధాన్యాన్ని గుర్తించే తాను క్యూలో కూడా నించుని ఓటేశానని ఆయన చెప్పాడు.