బాబుకు అర్హత లేదు: చిరు

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు తమ ద్వారా వస్తుందని నమ్ముతున్నారని, అందుకే తమను గెలిపిస్తారని ఆయన అన్నారు. తొలి విడత పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో తమకు అత్యధిక స్థానాలు తమకే వస్తాయని ఆయన అన్నారు. తమకు 75 నుంచి 80 స్థానాలు వస్తాయని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలోనే కాకుండా తెలంగాణలోనూ తమకు సీట్లు చాలా వస్తాయని ఆయన చెప్పారు. తమ ఓటర్లు చాలా తెలివైనవారని, తమను గెలిపించి తీరుతారని ఆయన అన్నారు.రాజకీయాల్లో చిరంజీవి రాణించడం లేదనే విమర్శను ఆయన కొట్టి పారేశారు. ఎవరో ఒకరి మీద బురద చల్లాలి కాబట్టి అల్లు అరవింద్ మీద విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications