స్విస్ డబ్బు తెప్పిస్తాం: అద్వానీ

LK Advani
ముంబయి: తమ పార్టీ అధికారంలోకి వస్తే స్విస్‌ బ్యాంకులో ఉన్న భారతీయుల నల్లధనాన్ని వందరోజుల్లో వెనుకకు రప్పిస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్రనేత అద్వానీ హామీ ఇచ్చారు. నల్లధనాన్ని దాచే బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా 70 ఉన్నాయని, వాటన్నిటితో సంప్రదించి నల్లధనాన్ని వెనుకకు రప్పిస్తామని ఆయన శుక్రవారం ముంబయిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. ఈ నల్లధనాన్ని దేశానికి రప్పించేందుకు ఇప్పటికే నలుగురితో ఒక టాస్క్ ఫోర్స్ వేశామని ఆయన చెప్పారు.

మన డబ్బు విదేశాల్లో ఉంటే దానివల్ల ప్రభుత్వాలకు పన్ను నష్టమే కాక దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదమన్నారు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ నివేదికను కూడా ఆయన ఉటంకించారు. ఈ విషయాన్ని తాము 2008 ఫిబ్రవరిలోనే లేవనెత్తామని ఎన్నికలకోసం కాదని ఆయన అన్నారు. నల్లధనం గురించి తాను మాట్లాడినప్పుడు తన పట్ల అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించినప్పుడు బాధేసిందని ఆయన చెప్పారు. స్విస్ బ్యాంకులకు పెద్ద యెత్తున భారత్ నుంచి ధనం వస్తున్నట్లు స్విస్ అంబాసిడర్ తనకు చెప్పినట్లు ఆయన తెలిపారు. నల్లధనం ఉందనే మాటను ప్రభుత్వం వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+