దమ్ముంటే..ఒవైసీ మహంతికి సవాల్‌

Asaduddin Owaisi
హైదరాబాద్‌: దమ్ముంటే యూనిఫాం తీసేసి వచ్చి... నాతో తలపడు అని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ డీజీపీ మహంతికి సవాల్‌ విసిరారు. పోలింగ్‌ రోజు డీజీపీ స్థాయి వ్యక్తి పాతబస్తీలో గంటన్నరపైగా ఉండాల్సిన అవసరం ఏముందని ఓవైసీ ప్రశ్నించారు. మహంతి మహాకూటమికి తొత్తులా వ్యవహరించారని ఆయన వ్యవహరించారు. డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తారని ఈసీకి ముందే చెప్పిన వారు పట్టించుకోలేదని అన్నారు. సుల్తాన్‌ షాహీ పోలింగ్‌ కేంద్రం వద్ద ఎంబీటీ కార్యకర్త దాడి చేసినందుకే ఆత్మరక్షణ కోసం తాను ఎదురుదాడి చేశానని ఒవైసీ అన్నారు.

అసదుద్దీన్ ఒవైసీ వ్యవహారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీరియస్ గా తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఒక ముఖ్యమైన అధికార యంత్రాంగానికి బాస్ అయిన రాష్ట్ర డిజిపి మహంతిపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలు, సవాల్ ను ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు సుమోటోగా పరిశీలించారు. ఒవైసీ వ్యాఖ్యలు చేసిన సిడిని ఆయన స్వయంగా పరిశీలించారు.ఎన్నికల యంత్రాంగంలో ఓ ముఖ్యమైన అధికారిని అనుచితంగా సవాల్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+