వైఎస్ ఉద్దేశం మంచిదే: వాయలార్
హైదరాబాద్: తెలంగాణాపై ముఖ్యమంత్రి వై.ఎస్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైనవేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల తాత్కాలిక ఇన్‌ఛార్జి వాయలార్ రవి అన్నారు. తెలంగాణాపై వై.ఎస్ వ్యాఖ్యలను కొందరు కాంగ్రెస్ నేతలు ఆయన దృష్టికి తీసుకునిరాగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ పరుషంగా చేసిన వ్యాఖ్యలను, మహాకూటమిలోనిఇతరుల వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తప్ప విద్వేషాలను రెచ్చగొట్టాలనో, దురుద్దేశంతోనే చేయలేదన్నారు. ఆయన మాటలకు వివరణ ఇవ్వాల్సింది కేసీఆర్ అని, వై.ఎస్ కాదని అన్నారు.












Click it and Unblock the Notifications