జయ ప్రధానికి అర్హురాలు: వైగో
చెన్నై: అన్నాడియంకె నేత జయలలిత ప్రధాని పదవికి అర్హురాలని ఎండిఎంకె నేత వైగో అన్నారు. అవసరం వస్తే తాము అందుకు సహకరిస్తామని ఆయన చెప్పారు. జయలలిత చురుకైన, విశేష ప్రతిభ గల నాయకురాలని ఆయన అన్నారు. ప్రధాని కావడానికి జయలలితకు తాను సహకరిస్తానని ఆయన చెప్పారు. ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆ మాటలన్నారు.
తనకు ప్రధాని పదవి చేపట్టాలనే కోరిక లేదని జయలలిత ప్రకటించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆమెకు కోరిక లేకపోవచ్చు కానీ తాము గొంతు ఎత్తుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications