పవన్ కళ్యాణ్ అరెస్టు, విడుదల
గుంటూరు: యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అనంత ఆయనను బెయిల్ పై విడుదల చేశారు. అనుమతి లేకుండా చిలుకూపేటలో ప్రసంగించినందుకు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఆదివారం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. ఒంగోలులో పర్యటన అనంతరం ఆయన గుంటూరు జిల్లా వచ్చారు.
హెలికాప్టర్లో సాంకేతికలోపంతో ఆయన బాపట్ల సభ సాయంత్రానికి వాయిదాపడింది. ఈలోగా ఆయన మార్గమధ్యంలో చిలకలూరిపేటలో ప్రసంగించారు. అయితే అక్కడ ప్రసంగించేందుకు ప్రజారాజ్యం తరపున ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.అనంతరం బెయిలుపై పవన్ విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications