కాకినాడలో జడ్జిపై యాసిడ్ దాడి
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సెషన్స్ కోర్టు జడ్జి నాగ మారుతి శర్మపై మంగళవారం యాసిడ్ దాడి జరిగింది. ఓ కేసులో తనకు అనుకూలంగా ఆయన తీర్పు ఇవ్వలేదని ఆగ్రహించిన సూర్యనారాయణ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. జడ్జిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications