బాబు అత్తగారి సొమ్మా..చిరు

Chiranjeevi
ఏలూరు: చంద్రబాబు నగదు బదిలీ పథకానికి స్విస్‌ బ్యాంకు నుంచి డబ్బు తెస్తానంటున్నారని, అక్కడేమైనా ఆయన అత్తగారి సొమ్ము ఉంచారా? అని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఎద్దేవా చేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఈ ఎన్నికల్లో 'సన్‌' స్ట్రోక్‌ తగలిందంటూ ఘాటు విమర్శలు చేశారు. తొలివిడత పోలింగు తర్వాత డీలా పడ్డారని చంద్రబాబు ఓట్ల కోసం చేస్తున్నవన్నీ గిమ్మిక్కులేనని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల, కొయ్యలగూడెం, నిడదవోలు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.

పాలకొల్లు నుంచి హెలికాప్టరులో వచ్చిన చిరంజీవి మధ్యాహ్నం ద్వా రకాతిరుమలలో చిన్నవెంకన్నను దర్శించుకుని ప్రచారానికి దిగారు. కాంగ్రెస్‌, టీడీపీలు తమను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి మంత్రం పఠిస్తూ సొంతంగా మాత్రమే అభివృద్ధి చెందారని, కోట్లు గడించారని ముఖ్యమంత్రి వైఎస్‌పై విరుచుకుపడ్డారు. దీన్ని భరించే శక్తిలేకే ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ను మూడో స్థానంలోకి నెట్టేస్తున్నారన్నారు.చంద్రబాబు కర్కోటకుడని, ఇప్పటిదాకా సంస్కరణవాదినంటూ ఆయ న గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికల కోసం పత్రికల్లో నిలువెత్తు ప్రకటనలు ఇస్తున్నారని..వీటిలో కాంగ్రెస్‌, టీడీపీలు ఒకరి తప్పులను మరొకరు చూపించి తమ నిజ స్వరూపాలను బయట పెట్టుకున్నారని, ఇదంతా ప్రజారాజ్యానికి లాభించే అంశమని అన్నారు. నిశ్శబ్ద విప్లవం వెనుక తమ పార్టీ విజయం దాగి ఉందన్నారు. అంతేగాక చంద్రబాబు నోటి వెంట పదేపదే కల్లుతాగిన కోతి అనే పదం వినిపిస్తోందని, కల్లుగీత కార్మికులను చులకన చేసే ఆ పదాన్ని వాడటం దయచేసి మానుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+