డాడికి జై..చిరు కుమార్తె
పి.గన్నవరం: డాడీపై మీరు చూపుతున్న అభిమానమే ఆయనను అందలమెక్కిస్తుందంటూ చిరంజీవి కుమార్తె సుస్మిత ప్రచారం చేసారు. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు లంక గ్రామాల్లో సోమవారం రాత్రి ఆమె రోడ్ షో నిర్వహించారు. వాడ్రేవుపల్లి శివారు పెదలంక నుంచి ప్రారంభమైన రోడ్‌షో కనకాయలంక మీదుగా చాకలిపాలెం చేరుకుంది. సుస్మితకు లంక గ్రామాల్లో చిరంజీవి అభిమానుల నుండి మంచి స్పందన లభించింది.
కనకాయలంకలో వలవల దొరబాబు కుటుంబసభ్యులు సుస్మితకు పసుపు, కుంకుమతో పాటు బట్టలు పెట్టారు. ప్రజారాజ్యం విజయం ఖాయమని అభిమానుల ఆదరణ మరువలేనిదన్నారు. ఆమె రోడ్ షో ఆద్యంతం హుషారుగా జనంతో మమేకమవుతూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ సాగింది. ఆమె రోడ్ షోకు ఉభయగోదావరి జిల్లాల సరిహద్దు లంకగ్రామాల్లోని ప్రజలతో పాటు పి.గన్నవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి అభిమానులు సైతం తరలివెళ్లారు.












Click it and Unblock the Notifications