మీదైతే..మాది వ్యభిచారమా ఎన్టీఆర్

Jr Ntr
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ మరోసారి బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. రెండోదశ ఎన్నికలను దృష్టిలో ఉం చుకుని సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న నాయకులను మళ్లీ ఎన్నుకుంటే ఏమవుతుందో ఆలోచించాలని ఆయన అన్నారు. "మే 16న కచ్చితంగా మంచం దిగుతాను. ఎవరు కాద న్నా సరే మహాకూటమి విజయోత్సవ సంబరాల్లో పాల్గొనడానికి వస్తాను. మే 16 సాయంత్రానికి రాష్ట్రం పసుపుమ యం కాబోతోంది. తొలివిడత ఎన్నికల్లో మహాకూటమి విజయ దుందుభి మోగించింది. మలివిడతలో 1983నాటి చరిత్రను టీడీపీ పునరావృతం చేయబోతోంది" ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ నాయకులకు ప్రజలు మనుషుల్లా కనిపించడం లేదని, గొర్రెల మందల్లా, కేవలం ఓటర్లలా కనిపిస్తున్నారని ఓట్ల కోసం వారు ఏమైనా చేస్తారని, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడతారని, మత కల్లోలాలను రెచ్చగొడతారని, తొలి విడత ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోబోతోందని తెలిసి ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా మరో ప్రాంతం లో ప్రచారం చేస్తున్నారని ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని అన్నారు. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కడం లేదని యాసిడ్‌ దాడి చేస్తున్న దుర్మార్గుల్లాంటివా రే ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్న పెద్దలు కూడా అని, అధికారం తమకు దక్కనందున రాష్ట్ర ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే చూసి ఆనందిద్దామని వారిలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

ఇదే కాంగ్రెస్‌ వారు ఒకప్పుడు ప్రత్యేక రాయలసీమ కావాలన్నారని, అధికారంలోకి రాగానే దానిని నట్టేట ముంచారని, 2000లో ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలంటూ రాష్ట్రపతికి, సోనియాగాంధీకి వినతిపత్రాలు సమర్పించారని, అధికారంలోకి వచ్చాక దానినీ నట్టేట ముంచారని, తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో విదేశీయుల్లా బతకాల్సి వస్తుందంటున్నారని, మరా విషయం తెలిసినవాళ్లు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో ఎందు కు పొత్తు పెట్టుకున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ పట్ల అభ్యంతరం లేదని నిన్నగాక మొన్న అసెంబ్లీలో ప్రత్యేక కమిటీ ఎందుకు వేశారో మీరే ఆలోచించండని, మీరు పొత్తు పెట్టుకుంటే ఒప్పు, మేము పెట్టుకుంటే తప్పా? మీరు చేస్తే శృంగారం, మేము చేస్తే వ్యభిచారమా?అని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ను ఇంటికి పంపేసి మహాకూటమిని గెలిపిద్దామని మీరు అనుకుంటుంటే మార్పు తెస్తామంటూ కొత్త పార్టీ పుట్టుకొచ్చిందని, నిన్నగాక మొన్న పుట్టి ఇంకా పాకడం కూడా చేతకాని వీళ్లు మార్పు తెస్తామంటున్నారని, రోజురోజుకు వాళ్ల పార్టీలోనే పుట్టుకొస్తున్న మార్పులను తట్టుకోలేక మార్పును సమాజంలో తేవాలో లేక వాళ్ల పార్టీలో తేవాలో తెలియక సతమతమవుతున్న వీళ్లు సమాజాన్ని మారుస్తామంటున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+