న్యూఢిల్లీ: సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలను అంతమెందించటానికి భారీ ఎత్తున కుట్ర పన్నిందని ఐఎస్‌ఐ కుట్ర పన్నిందని నిఘావర్గాలు ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించాయి. పంజాబ్ ఉగ్రవాదుల సాయంతో ఈ దాడులు చేయనున్నట్లు ఆ నివేదకలో తెలిపారు. అలాగే దేశంలోని మరికొందరు ముఖ్య నేతలను సైతం అంతం చేసి అల్లకల్లోలం సృష్టించాలని వారి పన్నాగంగా పేర్కొన్నారు. అందులోనూ ఎన్నికల ప్రచారంలో ఉన్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై దాడులు చేయటం చాలా సులభమని వారు బావిస్తున్నట్లు హెచ్చరిచ్చారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి ముప్పు పొంచి ఉందని వెల్లడించాయి. ఫిబ్రవరిలో ఉగ్రవాద సంస్థలు రావల్పిండిలో సమావేశమైనపుడు ఈ దాడి వ్యూహాలను రచించాయి. ఈ దాడులుకు లష్కరే తోయిబా మిలిటెంట్లను, ఆయుధాలను సమకూరుస్తుంది.