ఆర్టీసీ వివరాలకు ప్రత్యేక ఫోన్
హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల వివరాలు, రిజర్వేషన్ల గురించి ఫోన్ లో తెలుసుకోవడం ఎంత కష్టమో మనందరికీ అనుభవమే. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే వేసవిలో అయితే ఇక ఆర్టీసీ హెల్ప్‌లైన్ నెంబరు కలవటం దాదాపు అసాధ్యం. అలాంటి ఇబ్బందులన్నీ ఇక దూరం కానున్నాయి.
,br /> ప్రయాణీకులకు తక్షణం వివరాలు అందించేందుకు బీఎస్ ఎన్ ఎల్ సౌజన్యంతో ఆర్టీసీ ప్రత్యేక నెంబరును ఏర్పాటుచేసింది. ల్యాండ్ లైన్‌ద్వారా 12666 డయల్‌చేస్తే బస్సు సర్వీసుల వివరాలు, రిజర్వేషన్ల వివరాలు తదితర విషయాలు తెలుసుకోవచ్చని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ రవీంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లోని బస్ స్టేషన్లలో వివరాల కోసం ఆయా ప్రాంతాల ఎస్టీడీ కోడ్ ముందు డయల్ చేసి ఆ తరువాత 12666 డయల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications