ఎమ్మెల్యేపైకి చెప్పులు: కాల్పులు
కడప: కడప జిల్లా మైదుకూరు శాసనసభా నియోజకవర్గంలోని కుచ్పుపాక గ్రామంలో శాసనసభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డిపైకి కొద్ది మంది మహిళలు గురువారం చెప్పులు విసిరారు. గ్రామానికి వచ్చిన రవీంద్రా రెడ్డిని ప్రజలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. రవీంద్రా రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.ఈ దాడిలో రవీంద్రా రెడ్డి కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.
రాయచోటి శాసనసభా స్థానంలో ఇవియంలను ధ్వంసం చేశారు. దీంతో సిబ్బంది కొత్త ఇవియంలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కు స్వల్ప అంతరాయం జరిగింది. కడప జిల్లాలో పోలింగ్ సందర్భంగా చెదురు మొదురు సంఘటనలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications