వారికి మద్దతివ్వం: నవీన్

సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ తమకు వస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. కంధమాల్ హింస తర్వాత బిజెపితో తెగదెంపులు చేసుకున్నామని ఆయన చెప్పారు. కంధమాల్ హింస తర్వాత బిజెపితో కొనసాగడం అసాధ్యంగా మారిందని ఆయన చెప్పారు. ప్రధాని పదవికి శరద్ పవార్ ను గానీ వామపక్ష నేతను గానీ బలపరుస్తారా అని అడిగితే ప్రధాని అభ్యర్థి తగిన విధంగా ఉంటే, ఒరిస్సాకు హేతుబద్దం అనిపిస్తే పరిశీలిస్తామని ఆయన జవాబిచ్చారు. మీ పేరు ప్రధాని పదవి అభ్యర్థిగా ముందుకు వస్తే అంగీకరిస్తారా అని అడిగితే తనకు అలాంటి ఆశలు గానీ కలలు గానీ లేవని ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications