వైయస్ జిల్లాలో ఉద్రిక్తత
కడప: మలి విడత పోలింగ్ సందర్భంగా గురువారం కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి గన్ మెన్ మహిళా ఓటర్లపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఎమ్మెల్యేపై వారు రాళ్లతో, చెప్పులతో దాడి చేశారు. చాపాడు మండలం చిన్నగొనగనూరులో కాంగ్రెస్ వర్గీయులు బాంబులు విసిరి భయానక వాతావరణం సృష్టించారు. ఖాజీపేట మండలం నాగసానిపల్లెలో ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి రఘురామారెడ్డి కుమారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు గాలిలో 30 రౌండ్ల కాల్పులు జరిపారు.
చాపాడు మండలం నక్కలదిన్నెలో ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. ఖాజీపేట మండలంలో ముగ్గురు టీడీపీ ఏజెంట్లను ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారని గొడవ జరిగింది. రావులపాళెంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. పులివెందులలో చక్రాయపేట మండలం గడ్డంవారిపల్లెలో టీడీపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణతో పోలింగ్ ఆగిపోయింది. తొండూరు మండలం బూచుపల్లెలో టీడీపీ ఏజెంట్లను కాంగ్రెస్ వర్గీయులు బయటకు లాగేశారు. పులివెందులలో కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పాలెం శ్రీకాంత్‌రెడ్డిపై దాడికి దిగారు. అట్లూరు మండలంలో మూడు పోలింగ్‌బూత్‌లను కాంగ్రెస్ వర్గీయులు ఆక్రమించారు. రాయచోటి నియోజకవర్గంలో మద్దిరేవు బూత్‌లో కంట్రోల్ యూనిట్లను కొందరు ధ్వంసం చేయటంతో రీపోలింగ్‌నకు ఆదేశించారు. రాజంపేట మండలంలో పీఆర్పీ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగ చేశారు. ఉరుటూరులో కాంగ్రెస్ దాడుల్లో 12 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.
పులివెందుల నియోజకవర్గంలోని సిధారెడ్డిపల్లిలో బాంబు పేలుళ్లు సంభవించాయి. పులివెందుల నియోజకవర్గంలో ఐదు ఇవియంలను ధ్వంసం చేశారు. కోనరాజుపల్లెలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై శాసనసభ్యుడి అనుచరులు దాడి చేశారు. పెదచెప్పలిలో కమలాపురం తెలుగుదేశం అభ్యర్థి పుత్తా నర్సింహారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సింహారెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వీరశివారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications