అమర్ నాకు చాలా క్లోజ్: జయప్రద

తన వల్ల పార్టీ చీలిపోయే పరిస్థితి వచ్చిందని ఆజం ఖాన్ చేసిన ఆరోపణను ఆమె ఖండించారు. తనకు తమ పార్టీ నేతలు ములాయం సింగ్, అమర్ సింగ్ ఆశీస్సులున్నాయని ఆమె చెప్పారు. తన విజయం కోసం రాంపూర్ లో పార్టీ వంద కోట్ల రూపాయలు పెట్టినట్లు ఆజం ఖాన్ చేసిన ఆరోపణను ప్రస్తావించగా తాను వేయి కోట్లు ఖర్చు చేసి ఉంటే సంతోషించేదాన్నని ఆమె అన్నారు. రాంపూర్ లో తాను గెలిచి తీరుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తన స్టార్ స్టేటస్ కూడా తన విజయానికి ఉపయోగపడిందని ఆమె అన్నారు. అయితే అది తన రాజకీయ జీవితం తొలినాళ్లలోనే ఉపయోగపడిందని, ఇప్పుడు తాను చేసిన సేవలకు గుర్తింపుగా తనకు ఓటేస్తారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications