ఇంటర్ ఫైనల్లో బాలికలదే పైచేయి
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి అశుతోష్ మిశ్రా శుక్రవారం ఉదయం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. బాలికలు 62 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 58 శాతం మంది మాత్రమే పాసయ్యారు. మొత్తం 6 లక్షల 60 వేల 341 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3 లక్షల 97 వేల 170 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎ గ్రేడ్ లో 43 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతలతో 74 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం పొందగా 43 శాతంతో మహబూబ్ నగర్ జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది.
జిల్లాలవారీగా ఉత్తీర్ణతా శాతం హైదరాబాదులో 64, రంగారెడ్డి 72, మెదక్ 50, కరీంనగర్ 56, నిజామాబాద్ 67, ఆదిలాబాద్ 44, వరంగల్ 52, విశాఖ పట్టం 66, విజయనగరం 52, శ్రీకాకుళం 58, నల్లగొండ 51, తూర్పు గోదావరి 59, పశ్చిమ గోదావరి 60, నెల్లూరు 64, ప్రకాశం 61, గుంటూరు 65, చిత్తూరు 62, ఖమ్మం 54, అనంతపురం 53, కర్నూలు 54.












Click it and Unblock the Notifications