దేశం అభ్యర్థి నాగిరెడ్డి అరెస్టు
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం అభ్యర్థి పేరం నాగిరెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడులతో తాడిపత్రి అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాడిపత్రిలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ చాలా సమయం దాకా పరిస్థితి అదుపులోకి రాలేదు. సాయంత్రానికి కొంత మేర పరిస్థితి అదుపులోకి వచ్చింది.
నాగిరెడ్డిపై పోలీసులు చేయి కూడా చేసుకున్నారు. నాగిరెడ్డి అరెస్టుపై తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాము ఎవరికీ తొత్తులుగా పని చేయడం లేదని, పరిస్థితి అదుపులోకి వచ్చిందని డిఐజి సుజాతారావు చెప్పారు. తాడిపత్రి పరస్పర దాడులతో యుద్ధ భూమిని తలపిస్తోంది.












Click it and Unblock the Notifications