బ్లూ ఫిల్స్ యాక్టర్ల అరెస్టు
ముంబయి: అశ్లీల చిత్రంలో నటించిన ముంబయిలోని వెర్సోవాకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక ప్రవాస భారతీయుడు ఈ సినిమాను కొన్నేళ్ల క్రితం నిర్మించాడు. బ్లూ ఫిల్మ్ సిడీలు పశ్సిమ శివారులో పంపిణీ అవుతుండడంతో విషయాన్ని గమనించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. కొన్ని వేల రూపాయలకే ముగ్గురు స్త్రీలు, ఒక పురుషుడు ఈ బ్లూ ఫిల్మ్ లో నటించినట్లు అధికారులు చెప్పారు.
ఫుట్ పాత్ మీద నివసించే ఒక వ్యక్తి వద్ద పోలీసులకు ఆ సినిమా సిడీలు దొరికాయి. బ్లూ ఫిల్మ్ ప్రధాన నటిని గుర్తించడం వారికి పెద్ద కష్టమేమీ కాలేదు. ఆమె ఒక హిస్టరీ షీటర్ భార్య. భర్త అరెస్టయిన ప్రతిసారీ ఆమె పోలీసు స్టేషనుకు వస్తూ ఉండేది. దీంతో ఆమెను పోలీసులు సులభంగా గుర్తించగలిగారు.
ఆ బ్లూ ఫిల్మ్ ను ఐదేళ్ల క్రితం మీరా రోడ్డు ఫ్లాట్ లో తీసినట్లు ఆమె విచారణలో పోలీసులకు చెప్పింది. ఆ చిత్రంలో నటించిన మరో ఇద్దరు స్త్రీల్లో ఒకామె రెండేళ్ల క్రితం మరణించింది. ఈ చిత్రంలో నటించిన పురుషుడిని పోలీసులు పట్టుకున్నారు. మరో స్త్రీని పట్టుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications