రాష్ట్రంలో రీపోలింగ్ ప్రశాంతం
హైదరాబాద్: రాష్ట్రంలోని పది జిల్లాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ప్రకాశం జిల్లా లో మొదటి గంటన్నరలో 5 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక్కడ రీపోలింగ్ జరుగుతున్న 11 కేంద్రాల్లో ఉన్నతాధికారులు దగ్గరుండి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో కూడా రీపోలింగ్ మందకొడిగా సాగుతోంది.
మలివిడత ఎన్నికల్లో అవాంతరాల దృష్ట్యా ఈరోజు 10 జిల్లాల్లోని 63 పోలింగ్‌కేంద్రాల్లో ఆదివారం రీపోలింగ్ జరుగుతోంది. కడప జిల్లాలో అత్యధికంగా 21 చోట్ల రీపోలింగ్ జరుగుతోంది. రీపోలింగ్ సజావుగా జరిగేందుకు అదనపు బలగాలతో పాటు ప్రతి పోలింగ్‌కేంద్రం వద్ద సీనియర్ అధికారులను నియమించారు. కడపలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ, వీడియో కెమెరాలు ఏర్పాటుచేశారు.
రీపోలింగ్ జరుగుతున్న 23 కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు నమోదైన పోలింగ్‌శాతాలను ఎన్నికల కమిషనర్ సుబ్బారావు తెలిపారు. సరాసరిన 20 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలో 15 శాతం, నెల్లూరు 27 శాతం, కర్నూలు 13 శాతం, అనంతపురం 15 శాతం, చిత్తూరు 25 శాతం, పులివెందుల 16 శాతం, కడపలో 17 శాతం, కర్నూలులో 15 శాతం, మైదుకూరులో 12 శాతం, తూ.గోలో 26 శాతం, పశ్చిమగోదావరిలో 20 శాతం, గుంటూరులో 14 శాతం, కృష్ణా జిల్లాలో 20 శాతం పోలింగ్ నమోదైందని సుబ్బారావు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆయన తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications