కేరళ స్టైల్ 'ఇడియప్పం'.. ఇలా చేస్తే ఎవరైనా సూపర్ అనాల్సిందే..!
టిఫిన్స్ అనగానే మనకు ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, ఉప్మా ఇవే గుర్తుకువస్తాయి. ఇవి ఎప్పుడూ తింటూనే ఉంటాం. కాస్త వెరైటీగా నోటికి మరింత రుచిగా సాఫ్ట్ గా వెళ్లి జీర్ణం అయ్యే టిఫిన్ తినాలని ఉందా..? అయితే కచ్చితంగా ఇడియప్పం ట్రై చేయాల్సిందే.. కేరళలో ఇడియప్పం చాలా ఫేమస్.. మనదగ్గర ఈ వంటకాన్ని చేయడానికి చాలామంది వెనకడుగు వేస్తారు. ఇంకొంతమందికి అసలు ఈ వంటకం ఉంటుందని కూడా తెలియదు. మరి ఇంట్లోనే సులభంగా ఈ ఇడియప్పం ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
కేరళ స్టైల్ 'ఇడియప్పం' తయారీ విధానం చూస్తే ముందుగా కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి రెండు కప్పులు, ఉప్పు అర టేబుల్ స్పూన్, నూనె ఒక టేబుల్ స్పూన్, వేడి నీరు అవసరమైనవన్ని తీసుకోవాలి, నెయ్యి కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి మరిగించుకోవాలి. మరిగిన నీటిలో ఉప్పు, నెయ్యి లేదా నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో బియ్యం పిండి వేయాలి. ఇందులో కొద్దికొద్దిగా వేడి నీళ్లు పోస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత చేతులకు కొద్దిగా తడి అంటుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత జంతికల గొట్టంలో సన్న హోల్స్ ఉన్న కారప్పూస బిళ్ల పెట్టి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధంగా పెట్టుకున్న పిండిని అందులో వేసి మూత పెట్టుకోవాలి. మరోవైపు ఇడ్లీ ప్లేట్స్ కు నెయ్యి రాయాలి. ఆ తర్వాత పిండిని ప్లేట్స్ మీద పెట్టి కొద్దికొద్దిగా ఒత్తుకోవాలి. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో ఇడ్లీ ప్లేట్స్ పెట్టి ఉడికించుకోవాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మూడు నిమిషాల తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. ఇక అంతే వేడి వేడి ఇడియప్పం రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications