ఎల్లుండే కాలభైరవ అష్టమి- ఏలిన్నాటి శని ప్రభావం తగ్గే ఉపాయం

ఆధ్యాత్మిక జీవన విధానంలో భగవంతుని ఆరాధనకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా పరమశివుని రుద్ర రూపమైన కాలభైరవుడిని పూజించడం వల్ల జీవితంలోని సకల భయాలు, రోగాలు, కష్టాలు, శోకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రతి నెలా కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథిని 'కాలాష్టమి'గా జరుపుకొంటారు. ఈ ఏడాది జూలై 7న కాలాష్టమి రానుంది. ఆ రోజు భక్తిశ్రద్ధలతో కొలిస్తే మానసిక ప్రశాంతతతో పాటు సకల శుభాలు కలుగుతాయి.

హిందూ పంచాంగం ప్రకారం.. ఆషాఢ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి 7వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:24 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు మధ్యాహ్నం 12:21 నిమిషాలకు ముగుస్తుంది. శాస్త్ర నియమాల ప్రకారం, జూలై 7 వ తేదీ మంగళవారమే కాలాష్టమి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. సాధారణంగా మంగళవారం లేదా ఆదివారం వచ్చే కాలాష్టమికి ఆధ్యాత్మికంగా మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున చేసే ఉపవాసం ఎంతో పుణ్యప్రదమైనదిగా పరిగణిస్తారు.

Devotee performing rituals to Lord Kaal Bhairav during Kalashtami

కాలభైరవ పూజా విధానం

కాలాష్టమి రోజున భక్తులు ఉదయమే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి. ఇంట్లో పూజా మందిరంలో కాలభైరవుని పూజించవచ్చు లేదా సమీపంలోని ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. భైరవుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి శుద్ధ జలంతో అభిషేకం చేసి, పువ్వులు, గంధం, ధూపదీపాలను సమర్పించాలి. ఆవనూనెతో దీపం వెలిగించి, స్వామివారి కథను పఠించి చివరగా హారతి ఇవ్వాలి. నైవేద్యంగా తీపి పదార్థాలు సమర్పించాలి.

కాలభైరవ అనుగ్రహాన్ని త్వరగా పొందడానికి శాస్త్రాలలో కొన్ని ప్రత్యేక, సులువైన మార్గాలు సూచించారు పండితులు. ఈ రోజున కాలభైరవుడి వాహనమైన నల్ల కుక్కకు ఆవనూనె రాసిన రొట్టెలను తినిపించడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. రోజంతా 'ఓం కాలభైరవాయ నమః' అనే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలి. దీనివల్ల సాధకుడికి మానసిక దృఢత్వం పెరుగుతుంది. భయాలు తొలగిపోయి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.

జాతక దోషాల నివారణ - వ్రత ప్రయోజనాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కాలాష్టమి రోజున కాలభైరవుడిని శాస్త్రోక్తంగా పూజించడం వల్ల జాతకంలోని శని, రాహువు, కేతువు వంటి గ్రహాల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా అర్థాష్టమ శని లేదా ఏల్నాటి శని ప్రభావంతో బాధపడేవారికి ఈ పూజ ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. శత్రువుల భయం, పీడ వదిలిపోవడంతో పాటు సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాలభైరవుని కృపతో అనుకున్న పూజలు, పనులు సకాలంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి.

కాలభైరవుడి ఆరాధనతో మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నశించి, ధనాత్మక శక్తి ప్రవహిస్తుంది. ఎటువంటి చెడు దృష్టి, నకారాత్మక ఆలోచనలు మన దరి చేరవు. నిబద్ధతతో, స్వచ్ఛమైన మనస్సుతో కాలాష్టమి రోజున స్వామివారిని పూజించే భక్తులకు అన్ని రకాల సుఖసంతోషాలు లభిస్తాయి. ఈ వ్రత ప్రభావంతో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, కుటుంబంలో శాంతి నెలకుంటుందని విశ్వాసం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+